ఈ సంవత్సరం గణేష్ చతుర్థి తేదీ, శుభ ముహూర్తం
వినాయక చవితి వస్తుంది అంటే వారం రోజుల ముందు నుండే పల్లెలు అని కాదు పట్టణాలు అని కాదు, ఎవత్ భారత దేశం మొత్తం జై బోలో గణేశ్ మహారాజ్ కి అంటు సందడి తో మారుమోగిపోతోంది.
ఈ సంవత్సరం గణేష్ చతుర్థి తేదీ వివరణ (Vinayaka Chavithi 2025 Date)
మరో వారం రోజుల్లో మన అందరికి నచ్చిన పండుగ రాబోతుంది. ప్రతి యేడాది సెప్టెంబర్ లో వచ్చే మన లిటిల్ బాస్ గణేష్ చవితి ఈ ఏడాది ఆగస్ట్ 27 తేది రాబోతుంది.
శుభ ముహూర్తం(Vinayaka chavithi timings)
ఆది ఎలా అంటే మన హిందూ క్యాలండర్ ప్రకారం వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి రోజు జరుపుకుంటాం, అందుకే ఈ ఏడాది భాద్రపద మాసం చవితి ఆగస్టు 26 మధ్యాహ్నం 1: 56 మొదలవుతుంది, ఆగస్టు 27 న మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది. అందువలన ఈ ఏడాది మనం ఆగస్టు 27 వినాయక చవితి జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఏరోజైతే చవితి ఉండగా సూర్యోదయం అవుతుందో ఆరోజునే మనం పండగ జరుపుకుంటాం.
వినాయక చవితి అంటే ఒక యూనిటీ, మన దైనందిన జీవితంలో మనిషీ కి మనిషి కి మధ్య చాలా ఉంటాయి. కానీ వినాయక చవితి వచ్చింది అంటే అవన్ని పక్కన పెట్టి కలిసి కట్టుగా చందాలు వేసుకొని, మండపం నిర్మించుకొని చక్కగా అలకరించి, విగ్రహం తెచ్చి పెట్టీ అబ్బబ్బో మనకున్న బాధలు అన్ని మర్చిపోయి ఒకరికి ఒకరం అన్నటుగా సరదాగా నవరాత్రులు పండగ జరుపుకుంటాం
పూజ టైమింగ్ విషయానికి వస్తే ఉదయం 11;12 నుండి మధ్యానం 1;44 వరకు మంచింది అని మన హిందూ పంచాంగం తెలుపుతుంది. చక్కగా మన ఇళ్లలో గాని మన వీధిలో ఉన్న మండపాల్లో గాని ఈ శుభ సమయంలో పూజ ఆచరించి ఆ విఘ్నేశ్వరుడు కథ విని దీవెనలు అందుకోండి.
నిమజ్జనానికి మంచిది ఎప్పుడంటే
ఈ ఏడాది మన పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 6 తేదీ నిమజ్జనానికి మంచిది మనకు తెలుస్తుంది. ఈ నవరాత్రులు ఒక ఎత్తు నిమర్జనం రోజు ఒక ఎత్తు డప్పులు, దరువులు,డాన్స్ లు,dj లు ఊరేగింపులు, మనలో కొంత మంది ఆరోజు కోసమే సంవత్సరం అంతా వేచి చూస్తుంటారు. ధ్వని కాలుష్యం (సాండ్ పొల్యూషన్) దృష్టిలో ఉంచుకొని డీజే లు బదులు మన సంప్రదాయక డప్పులు, స్వరాలు తో మరియు మేలిమి లాంటి మట్టి గణేశుడు తో ఈ వినాయక చవితి 2025 ఘనంగా జారుకుందాం.
0 కామెంట్లు